Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అత్తారింటికి దారేది రీమేక్‌లో ఛాన్స్ కొట్టేసింది

సినిమా ఫీల్డ్‌లో అందం, అభినయం, టాలెంట్‌తో పాటు ఎన్ని ఉన్నప్పటికీ చివరకు కేవలం సక్సెస్‌లు మాత్రమే మాట్లాడుతాయి. ఎవరికైనా సక్సెస్‌లే ముఖ్యం. అంతేగానీ అందం, టాలెంట్‌ ఉన్నాయని వరుస అవకాశాలు రావు. ఈ విషయం హీరోయిన్ల విషయంలో మరింత కఠినంగా ఉంటుంది. గతంలో ఎందరో అందగత్తెలు, మంచి టాలెంట్‌ ఉన్న వారు కూడా సక్సెస్‌లు లేక మరుగున పడిపోయిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ కోవలోకి వచ్చే హీరోయినే మేఘాఆకాష్‌. ఈమె వాస్తవానికి తన మొదటి చిత్రం అక్కినేని అఖిల్‌ సరసన నటించాల్సి ఉంది. కానీ ఆ అవకాశం మిస్‌ కావడంతో.. ‘అందాలరాక్షసి’ ద్వారా లావణ్యత్రిపాఠి వంటి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ని తెలుగు తెరకు పరిచయం చేసిన హనురాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ నటించిన మంచి వైవిధ్య చిత్రం ‘లై’ లో హీరోయిన్‌గా చేసింది. 

సినిమాపరంగా, ఆమె నటన, అందం పరంగా మంచి మార్కులు పడినా కూడా సరైన సమయంలో విడుదల కాని ఫలితంగా ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. అయినా కూడా వెంటనే మరోసారి నితిన్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చింది. త్రివిక్రమ్‌ అందించిన రచనతో కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌, నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలుగా రూపొందిన ‘ఛల్‌మోహనరంగ’లో మరో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమని పలువురు భావించారు. కానీ ఈ చిత్రం కూడా పరాజయం పాలైంది. దాంతో ఎంతో అందగత్తె అయినా ఆమెకి టాలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. 

ప్రస్తుతం అధర్వ హీరోగా రూపొందుతున్న ‘బూమరాంగ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా ‘బూమరాంగ్‌’ విడుదల కాకముందే ఆమెకి కోలీవుడ్‌లో మరో మంచి అవకాశం తలుపుతట్టింది. తెలుగులో పవన్‌కళ్యాన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-సమంత-ప్రణీత నటించిన ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో ఈమె ఓ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈమెది సమంత పోషించిన లీడ్‌ హీరోయిన్‌ పాత్రా? లేక ప్రణీత పోషించిన సెకండ్‌ హీరోయిన్‌ పాత్రా? అనేది తెలియాల్సివుంది. తాజాగా సమాచారం ప్రకారం ఈమెది ప్రణీత పాత్రే అని తెలుస్తోంది. మరి ఈ రెండు తమిళ చిత్రాలతోనైనా ఈమె కోలీవుడ్‌లోనైనా గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది..! 



from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2wOEaps

Yorum Gönder

0 Yorumlar