Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అదిరిపోయిన సైరా కొత్త డైలాగ్..!

చిరు గురించి పరుచూరి పలికిన పలుకులు! 

తెలుగులో హీరోల ఇమేజ్‌కు, క్రేజ్‌కి వారికున్న ఫాలోయింగ్‌, బాడీలాంగ్వేజ్‌లకు అనుగుణంగా డైలాగ్స్‌ రాయడంలో, కథలను అందించడంలో పరుచూరి బ్రదర్స్‌ అగ్రజులని చెప్పకతప్పదు. వీరిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. మా కాంబినేషన్‌లో మేము రాసిన మొదటి చిత్రం ‘రోషగాడు’. ఆ తర్వాత ‘ఖైదీ’తో ఇక దానికి తిరుగేలేకుండా పోయింది. ఖైదీ చిత్రంలో మేము రాసిన ‘పగ కోసం ఈ జన్మఎత్తాను.. ప్రేమకోసం మరో జన్మఎత్తుతాను’ అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది. ‘గ్యాంగ్‌లీడర్‌’లో ‘అన్నయ్య.. రాముడుసీతను అనుమానించాడు గానీ లక్ష్మణుడు అనుమానించలేదురా’ అనే డైలాగ్‌కి క్లాప్స్‌ పడ్డాయి. 

‘ఘరానా మొగుడు’ దగ్గరకు వచ్చేసరికి ‘ఇంపాజిబుల్లా.. ఇస్తరాకుల కట్టా’ అనే డైలాగ్‌కి థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆశ్యర్యపోయాం. ‘శంకర్‌దాదా’ చిత్రంలో ‘రోగిని ప్రేమించలేని వాడు రోగితో సమానం’ అనే డైలాగ్‌ అలాగే ‘ఠాగూర్‌’లో ‘నీ కంఠంలోని నరాలు తెంచి నా బూటుకు లేసులుగా కట్టుకుంటాను’ అనే డైలాగ్‌ అయితే నాకే బాగా నచ్చేసింది. ఇక తాజాగా ‘సైరా...నరసింహారెడ్డి’లోని క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీన్‌ డైలాగ్‌ని మీతో చెప్పుకోవాలని అనిపిస్తోంది. సినిమా మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ రోజు ఓ డైలాగ్‌ చెప్పాను. ఈ డైలాగ్‌ మీ అందరికీ నచ్చింది. ఇక ఈరోజు ఇందులోని మరో డైలాగ్‌ మీకు చెప్పాలనుకుంటున్నాను.

‘సై..రా..నరసింహారెడ్డి’ క్లైమాక్స్‌లో కథానాయకుడి చేతులు విరిచేసి కట్టేస్తారు. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ‘ఏంట్రా.. ఆ ధైర్యం.. సావు భయం లేదా నీకు’ అని ఓ పాత్ర అంటుంది. దానికి సచ్చిపుట్టినవాడిని.. సనిపోయిన తర్వాత కూడా బతికేవాడిని. సావంటే నాకెందుకురా భయం... అనేది కథానాయకుడి నోటి నుంచి వచ్చే డైలాగ్‌. ఆగలేక మీకోసమని ఈ చిన్న డైలాగ్‌ని లీక్‌ చేశాను. చిరంజీవి గారు కోప్పడతారామో నిజంగా నాకు తెలియదు. ఆయన మీద ఉన్న ప్రేమతో, మీపై ఉన్న అభిమానంతో ఈ డైలాగ్‌ని లీక్‌ చేశాను.. అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

 ‘ఖైదీ’ తర్వాత చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయనతో మాకుగల అనుబంధం పెరుగుతూ వచ్చింది. ఓసారి లలితకళాతోరణంలో చిరంజీవి గారు మాట్లాడుతూ, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఓ పుస్తకం వెలువడితే.. అందులో పరుచూరి బ్రదర్స్‌కి చెరో పేజీ ఉంటుందని చెప్పిన మహానుభావుడు చిరంజీవి అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. 



from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2BNU75k

Yorum Gönder

0 Yorumlar